చెక్కపల్లిలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

నూజీవీడు నియోజకవర్గం , ముసునూరు మండలం, చెక్కపల్లి గ్రామంలో జరిగిన జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు బర్మా ఫణిబాబు విపాల్గొని, సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వ కిట్లు పంచడంజరిగింది. ఈ సందర్బంగా బర్మా ఫణిబాబు మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో సుమారు 1500 మంది సభ్యత్వం తీసుకోగా ఈరోజు కొంతమందికి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ జరిగింది. అలాగే వచ్చేది జనసేన-టిడిపి ప్రభుత్వం అని, ప్రజలు వైసిపిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. ఈ కార్య క్రమంలో చెక్కపల్లి గ్రామ ప్రజలు, జనసేన నాయకులు పాశం నాగబాబు, తోటవెంకట్రావు, ఏనుగులచక్రీ, సూరిశెట్టి శివ, గొల్లపల్లి శ్రీకాంత్, తోట సత్యం , శ్రీధర్, మారుతి , రవి , శ్రీను, సతీష్, వెంకట్, కడియం సత్య నారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.