ఘనంగా యాదమరి మండల జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

పూతలపట్టు : పవన్ కళ్యాణ్ కోసం యువత ఆరాటపడుతున్నారన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. అమ్మా , నాన్న , ఓ పవన్ కళ్యాణ్ అంటూ యువత నినదిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను అందరిలోకి తీసుకెళ్లేందుకు జనసైనికులు కష్టపడుతున్నారన్నారు . పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. అంతకుముందు యాదమరి మండలం పూలకండ్రిగలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అకెపాటి సుభాషిణి , రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంఛార్ జిశివ ప్రసాద్, జిల్లా కార్యదర్శులు శివయ్య , ఆనంద్, మండల అధ్యక్షులు పురుషోత్తం , కుమార్, మనోహర్,చంద్రయ్య , టిడిపి ఇంఛార్ జి మురళి మోహన్ , మండల కన్వీనర్ గిరిధర్ బాబు, జిల్లా కార్యదర్శి కోదండ యాదవ్,టిడిపి పరిశీలకులు భొమ్మన శ్రీధర్, క్లస్టర్ ఇంఛార్ జి, మోహన్ నాయుడు , సర్పంచ్ కొక ప్రకాష్, మండల అధ్యక్షులు దిలీప్, మురార్జి తదితర టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.