ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన-తెలుగుదేశం కో-ఆర్డినేటర్ శ్రీమతి లోకం మాధవి పిలుపు మేరకు ఆదివారం విజయనగరంలోని 9 నియోజకవర్గాలలో రైతు గర్జన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో వర్షా భావం వలన కరువు ఛాయలు అలుముకున్న వేళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం చాలా బాధాకరం తన రక్తాన్ని శ్రమగా మలిచి సేధ్యం చేసే రైతన్నకు అడుగడుగునా అవరోధాలే. నెల్లిమర్ల నియోజకవర్గంలోని తోటపల్లి కాలువ వదలక పోవడం వలన సుమారు 42,000 ఎకరాల సాగునీరు అందించలేకపోయారు. ఆ కాలువకి పూర్తిస్థాయిలో మరమ్మత్తులతో కూడుకొని ఉంది, రామతీర్థ సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు ఆనాడు సుమారు 24 వేల ఎకరాలకి త్రాగునీరు అందిస్తా మని ప్రారంభించిన ప్రాజెక్టు అడ్డదారులు తొక్కుతూ ఈనాడు ఎయిర్పోర్టుకి మరియు విజయనగరానికి నీరు అందించేలా ఆ ప్రాజెక్టుని పూర్తిస్థాయిలో మార్చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం , ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి కార్యరూపందాల్చలేదు, ఇది పూర్తిస్థాయి వైసిపి వైఫల్యమే అని మాధవి ఎండగట్టారు. రైతుల పక్షపాతి అని డప్పే సుకుని వైసీపీ ప్రభుత్వం రైతుల సుభిక్షం కోసమే అంటూ ఏర్పాటు చేసి న ఆర్బికె కేం ద్రాలు ప్రతి ఏడాది నాణ్య తలేని విత్తనాలు ఇవ్వటమే కాకుం డా సేద్యా నికి అవసరమయ్యే యూరి యా, పొటా షియం, ఫాస్ప రస్ వంటి ఫెర్టిలైజర్స్ ను అవసరా నికి తగ్గట్టుగా వాడే రైతుకు ఇవి ఒక క్రమ పద్ధతిలో కొనాలని మాం డేట్ పెట్టడం దగ్గర నుం చి, పెట్టుబడి రా యితీలు రా కపోవడం, ఇన్ పుట్ సబ్సి డీలు ఇవ్వకపోవడం, అలా గే కార్పొరే ట్ భీమా కంపెనీలకు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా ఈ-క్రాప్ వంటి వాటి లో సాంకే తిక అవరోధాలతో రైతుకు పరి హారం ఎగవేస్తున్నా రు. ఈ అవరోధాలు అన్నీ దాటుకొని మనకు ఆహారం అందించేందుకు రైతు వ్యవసాయం చేస్తున్న వైనం. అరకొర అదునులో ఉన్న దంతా ఊడ్చి దుక్కి పాల్జేసిన రైతన్న ఇప్పుడు వర్షాభావం వలన తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. ధరా ఘాతంతో సాగుపెట్టుబడులు పెరిగి పోయి ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని వర్షా భావ పరిస్థితులు మరింత గడ్డుస్థితిలోకి నెట్టేస్తున్నాటు సు్తనానియి. పంట పోతే చేసిన అప్పులు తీర్చలేక రైతు కుటుంబాలు కృంగిపోతూ ఆత్మహత్యలు చేసుకునే విచారకర పరిస్థితిలో రైతాంగం ఉంటే పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం. విశాఖపట్నంలో జరుగుతున్న ఐసీఇడి సదస్సు ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు హుటా హుటిన 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకొంది. వాస్తవానికి 400లకు పైగా మండలాలలో కరువు పరిస్థితులు ఉన్నాయి కాని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి ఈ దుం దుడుకు చర్యలు. ఇప్పటికే రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ లో 24 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గి ప్రమాద ఘంటలు మోగుతున్న వేళ ఇప్పుడు వచ్చిన ఈ కరువు పరిస్థితులు ఆహార ఉత్పత్తుల పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. నిత్యావసర కొరతలు ఏర్పడే ప్రమాదం ఉంది. మనకు ఇంతకుమునుపు వచ్చిన కరువు పరిస్థుతుల నుండి పాఠాలు నేర్చుకుని ఉండి ఉంటే పోలవరంలాంటి ప్రాజెక్టుల పూర్తిచేయడం మీద అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ మీద చెరువుల, కాలువలు మరమ్మతుల మీద ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో ఉన్న తోటపల్లి కాలువ నుంచి నీరు వదలడం మీద దృష్టి పెట్టి ఉంటే కొద్ది పాటి వర్షాలు పడినప్పటికీ ఆ నీరును వృధాపోకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లేలా ప్రణాళికలు సి ద్ధమయ్యే వి కాని ఈ ప్రభుత్వా నికి బటన్లు నొక్కడం మీద ఉన్న శ్రద్ధ రైతు సమస్యల మీద లేదు.
గంపెడు ఆశలతో విత్తులు, పైర్లు వేసి నాష్టాలపాలై ఇన్ని కష్టాల కడలిలో ఉన్న రైతాం గానికి అండగా నిలబడి కరువు వల్ల నష్టపోయిన ప్రతీ ఎకరాకు రూపాయలు 25,000/- ఆర్థిక చేయూతను అందించి ప్రభుత్వం అండగా నిలవాలి అలాగే ప్రత్యామ్నాయ పంటల సాగుకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిం చాలి. ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు ప్రత్యేక భత్యం చెల్లించాలి. అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న 34 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి అండగా నిలబడాలి అనే నినాదంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ నియోజకవర్గంలోను రైతులతో పెద్ద ఎత్తున ప్రభుత్వంలో చలనం వచ్చేలాగా నిరసనలు తెలియచేయడం జరిగింది. అందులో భాగంగా ఆదివారం నెల్లి మర్ల నియోజకవర్గం లో శ్రీమతి లోకం మాధవి నేతృత్వంలో నెల్లి మర్ల మండలంలోని మల్యా డ గ్రామం నుం చి మొదలుపెట్టి రైతులతో మాట్లాడుతూ వారి సమస్య లు తెలుసుకుం టూ ముం దుకు సాగుతూ ఓమ్మి గ్రామం మీదుగా 1500 మంది రైతులతో పాదయాత్ర చేస్తూ రైతుల తరపున వారి సమస్య ల కోసం గర్జిస్తూ బారీ జనసందోహం మధ్య సతివాడ గ్రామం చేరుకుని రైతులను ఉద్దే శిస్తూ ప్రసంగిం చి రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డా రు రైతన్న ను ఆదుకోవాలని తన ఆవేదన వ్య క్తం చేశారు అలా గే ముం దుకు సాగుతూ రా మతీర్థం గ్రామంలో బీడు భూములను రైతుల తో కలిసి పర్య వేక్షిం చి కరువు పరిస్థి తులను తన గళం ద్వారా వినిపిం చారు అనంతరం పాత్రికే య మి త్రుల తోను, డిజిటల్ మీడియా వారి తోను ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిం చారు.