అనకాపల్లి నియోజకవర్గ జనసేన విస్తృత స్థాయి సమావేశం

అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు . జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కర రావు ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా ఈ సమావేశం నిర్వహించారు . అనకాపల్లి పట్టణంలో పెంటకోట కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గం జనసైనికులు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీగా పార్టీ కార్యాలయం నుండి సమావేశం వేదిక వద్దకు చేరుకున్నారు . ఈ సందర్భంగా పరుచూరి భాస్కరరావు గారు మాట్లాడుతూ ప్రస్తుతం రూరల్ జిల్లా బలమైన నాయకత్వంతో ముందుకు వెళుతుందని అన్నారు . రానున్న ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో కృషి చేసి జనసేన టిడిపి కూటమి ఘనవిజయం సాధించడానికి అనకాపల్లి నుండి నాంది పలుకుతామని అన్నారు . అనంతరం పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ అనకాపల్లిలో మంత్రి అమర్ని రాష్ట్రంలో వైఎస్ జగన్ని గద్దె దింపి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలని అన్నారు . భాస్కర్రావు గారి నాయకత్వంలో అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు . సమావేశం అనంతరం అనకాపల్లి మండలం అనకాపల్లి పట్టణం మరియు కసిం కోట మండలం కోర్ కమిటీ సభ్యులు రమేష్ బాబు గారిని ఘనంగా సత్కరించారు . ఈ కార్యక్రమంలోని యోజకవర్గ పరిధిలో ఉన్న జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.