తాలింఖానా శిక్షణలో విద్యార్థులకు శీతలపానీయాలు పంపిణీ చేసిన జనసేన నాయకులు

అమలాపురం: అమలాపురంలోని రవణం వీధిలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న తాలింఖానా శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మరో వారం రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనున్న నేపథ్యంలో శిక్షణలో పాల్గొంటున్న విద్యార్థినీ, విద్యార్థులకు జనసేన నాయకులు సుదా చిన్నా ఆధ్వర్యంలో శీతలపానీయాలు పంపిణీ చేశారు.

వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని శిక్షణార్థులకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొని తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారని, వారికి అవసరమైన సహకారం అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని జనసేన నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవతో పాటు యువతకు ప్రోత్సాహం అందించే కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.