రాజంపేట: ఉమ్మడి కడపజిల్లా రాజంపేట: మండల పరిధిలోని భువనగిరి పల్లెకు సమీపంలో ని జాతీయ రహదారి వద్ద గల అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానం కార్యక్రమానికి డి ఆర్ డి ఏ మాజీ రాష్ట్ర అధికారి, రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు తన తండ్రి యల్లటూరు వెంకట రాజు గారి జ్ఞాపకార్థం శుక్రవారం రూ 50 వేలు వితరణ చేశారు. ముందుగా శ్రీనివాసరాజు గారికి తన కార్యకర్తలు, మిత్రులతో కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష తీసుకుని మండలం పాటు కఠోర నియమ, నిష్టలతో సాత్వి క జీవనాన్ ని గడిపే అయ్యప్ప మాలాధారుల నిష్ఠ, భక్తి శ్రద్ధలు అనిర్వ చీనయమైనవని అన్నా రు. అలాం టి అయ్యప్ప భక్తులకు తన వంతు సహాయం అందిం చడం ఆ భగవంతుడు తనకిచ్చి న గొ ప్ప అవకాశమని తెలి పారు. అయ్యప్ప స్వామి కృపాకటా క్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యా లతో శోభిల్లా లని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జనసేన నా యకు లు శిం గంశెట్టి నరేం ద్ర, కడిమె ల్ల శ్రీనివాసరాజు, యల్లటూరు శివరామరాజు, ఆకు ల చలపతి, నా సర్ ఖాన్, పత్తి నారాయణ, సలీం , అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.