
మార్కాపురం: ఆగస్టు 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ ద్వారా నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేయనున్న నేపథ్యంలో కనిగిరిలో సోమవారం ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 బైకులతో ఈ ర్యాలీ కొనసాగింది.
అభయాంజనేయస్వామి దేవాలయం, బాప్టిస్ట్ చర్చి, మసీదులో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం గంగమ్మ దేవాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి డోలా వీరాంజనేయస్వామి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో మార్కాపురం ప్రాంతం సస్యశ్యామలం కానుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలోని సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 31న జరగనున్న కృష్ణా జలాల విడుదల కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.