
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని బృందావనం అపార్ట్మెంట్లో పగడాల మల్లికార్జున్ కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు జనసేన పార్టీ మార్కాపురం జిల్లా నాయకులు ఇమ్మడి కాశీనాథ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయ కమిటీ సభ్యులు విజయరావు నరసింహారావు, జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, బండి రాజా రమేష్, చాబోలు ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.