
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మపథం కార్యక్రమాల భాగంగా నిత్యకళారాధన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పల్నాడు ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర వీరాంజనేయ భజన బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ భజన కార్యక్రమంలో శివ శివ శంభో, కాలభైరావాష్టకం, ఆనందామృత, విజయాంబికే, సకల మంత్రముల, అంబావాణీ, గౌరీ మనోహర, వినాయకుని వలెను, జయజయదేవి, మహిషాసురమర్థిని, శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి, కైలాసగిరివాసా, కాళింగనర్తన, దుర్గాదేవి దురితనివారిణి, కామకోటిపీఠవాసిని వంటి పలు భక్తిగీతాలు, అష్టకాలు ఆలపించబడనున్నాయి.
ఈ గీతాలను వెంకటేశ్వర్లు, రమాదేవి, లక్ష్మి సుజాత, నాగేంద్రం, శ్రీదేవి, జ్యోతి తదితరులు ఆలపించనున్నారు. కార్యక్రమానికి తబల సహకారాన్ని నాసరబాబు, హార్మోనియం సహకారాన్ని శేషమ్మలు అందించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా స్వామి అమ్మవార్లకు కైంకర్యాలు సమగ్రంగా జరగాలని, అలాగే ప్రాచీన సంప్రదాయ కళలను పరిరక్షించాలనే లక్ష్యంతో ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.