
రాజానగరం, జనసేన కార్యాలయం:
రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రాజానగరం జనసేన పార్టీ కార్యాలయంలో రాజానగరం, సీతానగరం, కోరుకుండ మండలాల ఎంపీడివో లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ముఖ్యంగా, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చూడాలన్న సూచన ఇచ్చారు. 18 సంవత్సరాలు లోపు ఉన్న మానసిక వికలాంగత (MR), మానసిక అనారోగ్యం (MI) కేటగిరీలలో తాత్కాలిక వైద్య ధృవపత్రం పొందిన వారికి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు అందుతున్నాయని స్పష్టం చేశారు.
పెన్షన్ నిలుపుదల చేయలేని వారు లేదా కొత్తగా అప్లై చేసుకోవలసిన వారు ఈ నెల ఆగస్ట్ 25 లోపు సంబంధిత సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ వద్ద అప్లికేషన్ లేదా రీవెరిఫికేషన్ చేయించుకోవచ్చని తెలిపారు.
సమావేశంలో సంబంధిత అధికారులు, జనసేన పార్టీ “నా సేన” రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, అలాగే జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.