ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ లొ యువతీ యువకులకు అవకాశాలు

మార్కాపురం: మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత ఐ ఏ ఎస్ పీఎం ఇంటర్న్షిప్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఇందులో భాగంగా మార్కాపురం జిల్లా యువతి, యువకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ద్వారా యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత ఐ.ఏ.ఎస్ తెలిపారు.

ఈ పథకం మూడో దశ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన యువత వెంటనే ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ఇంటర్న్షిప్ ద్వారా యువతకు ప్రాక్టికల్ అనుభవంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించబడుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు, 10వ తరగతి, ఇంటర్, ఐటీ ఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ అర్హులన్నారు.

కుటుంబ వార్షిక ఆదాయం రూ.12 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు. ఇంటర్న్షిప్కు ఎంపికై న వారికి నెలకు రూ.9,000 వరకు సైపెండ్ అందించబడుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.6,000 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇంటర్న్షిప్ కాలం 6 నుంచి 9 నెలల వరకు ఉంటుంది. ప్రాక్టికల్ వర్క్, స్కిల్ ట్రైనింగ్, అనుభవం పొందే అవకాశం ఉంటుందన్నారు.

మరిన్ని వివరాలకు https://pminternship.mca.gov.in పోర్టల్ ద్వారా నమోదు చేసుకోగలరు మరియు ఈ క్రింది ఉన్న ఫోన్ నంబర్లు 9912438757, 7997151082 ను సంప్రదించవచ్చు అని స్థానిక జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కంచిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.