
జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, సోదరులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా, ప్రజాసేవలో, జనసేన పార్టీ కార్యకలాపాలలో నిమగ్నమవ్వాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.