

గౌరవ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శనివారం శాసనసభ విరామ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు కలిశారు. తమ నియోజకవర్గాల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. పరిష్కారానికి సహకరించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్ర మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, శ్రీమతి లోకం నాగమాధవి గారు, శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, శ్రీ గుమ్మనూరి జయరాం గారు తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో ఉన్నారు.