
• మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. బుధవారం సాయంత్రం జరగనున్న ఈ కార్యక్రమం నిమిత్తం అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఎన్.ఎ.డి. జంక్షన్, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సిరిపురం మీదుగా ఆంధ్ర యూనివర్శిటీకి వెళ్తారు.