
ఈరోజు కొప్పర్రు గ్రామసంఘం–2 సభ్యులు, జనసేన వీర మహిళలు, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, PACCS చైర్మన్ మరియు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న శ్రీ అందే నరేన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా డ్వాక్రా సభ్యులు, డ్వాక్రా భవనం వద్ద తలెత్తిన సమస్యలను నరేన్ గారికి వివరించి వాటి పరిష్కారం కోసం విజ్ఞప్తి చేశారు. గ్రామాభివృద్ధి కోసం వచ్చిన ఈ అభ్యర్థనలపై స్పందించిన నరేన్ గారు, “వీలైనంత తొందరగా సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో చర్చించారు.” ఆయన సమగ్ర అభివృద్ధి కోసం తానే ముందుండి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తరువాత, మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తేలియాచేసారు.