జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా 12 డివిజన్లలో జనసేన అభ్యర్థుల నామినేషన్…
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థులు 12 స్థానాల్లో నామినేషన్ వేశారు. అయితే పొత్తు ధర్మంలో భాగంగా ఇప్పటికే 10 డివిజన్లు జనసేనకు కేటాయించింది బీజేపీ. ఆదివారం నామినేషన్ చివరి రోజు కావడంతో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు శ్రీ శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు, ఖమ్మం జిల్లా ఇంచార్జి శ్రీ రామ్ తాళ్ళూరి నేతృత్వంలో అభ్యర్థులతో నామినేషన్ వేయించారు.
ముస్తఫా నగర్ నుంచి ర్యాలీగా బయలుదేరి, ప్రకాశ్ నగర్, గాంధీ చౌక్, సారధి నగర్, ఎఫ్ సీ ఐ, బైపాస్ రోడ్ మీదుగా డీ ఆర్ డీ ఏ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు. శ్రీ శంకర్ గౌడ్, శ్రీ రామ్ తాళ్ళూరి, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి శ్రీ వి.వి. రామారావు, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీ దుంపటి శ్రీనివాస్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు శ్రీ మిరియాల జగన్, సమన్వయకర్త శ్రీ ఎండీ సాదిక్ అలీ, ప్రధాన కార్యదర్శి శ్రీ సురభి సూరజ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన అభ్యర్థులు వీరే..
- మిరియాల జగన్ – 23వ డివిజన్
- ధనిశెట్టి భానుమతి – 48వ డివిజన్
- గరదాసు సుమలత – 47వ డివిజన్
- భోగా హరిప్రియ – 28 వ డివిజన్
5.A బండారు రామకృష్ణ- 16 వ డివిజన్
5.B నల్లగట్ల శ్రీనివాస రావు – 16 వ డివిజన్
- బోడా వినోద్ – 8 వ డివిజన్
- గుండా పవన్ కళ్యాణ్ – 60 వ డివిజన్
- సింగారపు చంద్రమౌళి – 51 వ డివిజన్
- తూము ఉమామహేశ్ – 2 వ డివిజన్
- యాసా మురళీకృష్ణ – 13 వ డివిజన్
- మైలవరపు మణికంఠ – 36 వ డివిజన్
- యాసంనేని అజయ్ కృష్ణ – 14 వ డివిజన్
