
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికీ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గారి పక్షాన అభినందనలు తెలియజేస్తున్నామని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సూచనల మేరకు సభ్యత్వ నమోదు గడువును మరికొన్ని రోజులు పొడిగిస్తూ, ఏప్రిల్ 10వ తేదీ వరకు సభ్యత్వ లింక్స్ ఓపెన్ చేసి ఉంచాలని నిర్ణయించారు.
ఈ అవకాశాన్ని పార్టీ నేతలు, వీర మహిళలు, జనసైనికులు, సాధక్‌లు సద్వినియోగం చేసుకోవాలని పార్టీ విజ్ఞప్తి చేసింది.
జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ సభ్యత్వ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని నాయకులు పేర్కొన్నారు.