



మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన “జనవాణి” కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీమతి రేఖ గౌడ్ గారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా వినిపించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేత శ్రీ గంజి చిరంజీవి గారు మరియు లీగల్ సెల్ ప్రతినిధి పాల్గొని ప్రజల సమస్యలపై చర్చించారు. ప్రజలకు న్యాయం చేయడంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని నాయకులు తెలిపారు.