అమరావతి చట్టబద్ధతపై పిడుగురాళ్లలో సంబరాలు

పిడుగురాళ్ల: ఆమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక రోజును పురస్కరించుకుని పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ బిల్లు ఆమోదానికి సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరియు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు సూచనల మేరకు, మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ కార్యాలయంలో దీపాలు వెలిగించి ప్రజలతో సంఘీభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పిడుగురాళ్ల మండల కన్వీనర్ కామిశెట్టి రమేష్, నియోజకవర్గ అధికార ప్రతినిధి అడపా వెంకట్, మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, బేతంచెర్ల ప్రసాద్, కార్యదర్శులు దీకొండ కిరణ్ కుమార్, కొమిరిశెట్టి సతీష్, నకరికంటి నరసింహారావు, బేతంచెర్ల నాగేశ్వరరావు, గుంటూరు శ్రీనివాసరావు, తోట రామదాసు, చింతా వెంకటశివరావు, కామిశెట్టి చిన్న వెంకటేశ్వర్లు, నూతి నాగేశ్వరరావు, కామిశెట్టి అమరలింగేశ్వరరావు, తెలగనీడి శ్రీనివాసరావు, జొన్నలగడ్డ రాజేష్, తుమ్మలచెరువు ఆంజనేయులు, సింగంశెట్టి పూర్ణచంద్రరావు మరియు వీర మహిళలు సింగంశెట్టి వెంకటరమణ, గోపిశెట్టి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల మధ్య సంఘీభావాన్ని మరింత బలపరిచారు మరియు అమరావతి విజయాన్ని ప్రతిబింబించేలా దీపాలను వెలిగించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.