రామనవమి వేడుకల్లో పాల్గొన్న దాసరి రాజు

ఇచ్చాపురం: కంచిలి మండలం, తలతంపర గ్రామంలో రామనవమి, రామ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గ్రామ పెద్దలు, జనసేన నాయకులు శ్రీ రాముల వారిని దర్శించుకున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పెద్దలు దాసరి రాజుకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు.

క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారత్న పురస్కార గ్రహీత పిరియా చలపతిరావు మరియు 2025 కందుకూరి విశిష్ట పురస్కార గ్రహీత జల్లెడ చలం లకు దాసరి రాజు చేతుల మీదుగా ఘన సన్మానం కూడా చేశారు.

కార్యక్రమంలో తలతంపర గ్రామ సర్పంచ్ ప్రతినిధి జగబంధు దొలాయి, పెద్దలు పూర్ణ, జనసేన నాయకులు సంతోష్, సతీష్, కవిటి మండల నాయకులు, కుసుమపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్ కుమార్, లోళ్ళ సాగర్, తెంబూరు ఆశిష్ కుమార్, యర్ర మధు, తేజ, జనసైనికులు నవీన్, బొర్ర శివ, దున్న ఈశ్వర్, దున్న జస్వంత్, దుమ్ము కోదండ, మర్రి సురేష్, కమిటీ సభ్యులు జగదీష్ సాహు, సంతోష్ రౌలో, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.