భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ 47వ వసంతంలో అడుగిడుతున్న శుభ తరుణాన ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారికి, గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారికి, ఇతర ముఖ్య నాయకులకు, ఆ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్టు చేశారు. దేశం పట్ల ప్రేమ, దేశ ప్రజల పట్ల అంకితభావం అనే సిద్ధాంతాలే ఆలంబనగా ముందుకు వెళ్తోంది. మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ గారు, శ్రీ ఎల్.కె. అద్వానీ గారు లాంటి మహనీయుల సంకల్పం, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అచంచల విశ్వాసంతో కూడిన పోరాటంతో నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా కీర్తిని ఆర్జించింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో సైతం సమర్ధవంతమైన విధానాలు అమలు చేస్తూ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. భారతీయ జనతా పార్టీ వికసిత్ సంకల్పం దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.