
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు భుజానికి గాయం అయినట్లు ఆయన బృందం అధికారికంగా వెల్లడించింది. ఇటీవల జరిగిన ఓ అనుకోని ఘటనలో ఈ గాయం కావడంతో వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షించిన అనంతరం, గాయం పూర్తిగా నయమయ్యేందుకు 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించింది.
అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ బృందం స్పష్టం చేసింది. వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటారని, అవసరమైనప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ వార్తతో అభిమానులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పోస్టు చేస్తున్నారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి సినిమా షూటింగ్‌లలో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు.