
వాడపల్లి: వాడపల్లి దేవస్థానం రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం దేవస్థానంలో నిర్వహించారు.
ఆర్డీవో, దేవస్థానం డీసీ సమక్షంలో జరిగిన సమావేశంలో దేవస్థానం డైరెక్టర్ చింతపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. రహదారి విస్తరణ వల్ల కలిగే ప్రయోజనాలు, రైతుల అభిప్రాయాలు, భూసేకరణకు సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా రైతులు తమ సందేహాలను అధికారుల దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులు వాటిపై వివరణ ఇచ్చి అవగాహన కల్పించారు. రహదారి విస్తరణ ప్రక్రియలో రైతుల సహకారం అవసరమని అధికారులు పేర్కొన్నారు.