
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు, సుందర్ వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మనోహర్‌కు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నాదెండ్ల భాస్కరరావు రాజకీయ జీవితంలో చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.