
- ఆపన్నులకు… సామాన్యులకు మరింత అండగా మెగాభిమానులు
- మెగాఫ్యామిలీపై అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
- మెగా యూత్ ఫోర్స్ జాతీయ అధ్యక్షులు ఏడిద బాబీ, జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి
గుంటూరు: ప్రజలకు సేవ చేయటం, కష్టాల్లో, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి జన్మతః వచ్చిన గొప్ప సుగుణమని, ఆ క్రమంలోనే తన అభిమానులతో సమాజహితం కోసమే మెగా యూత్ ఫోర్స్ స్థాపనకు అంకురార్పణ జరిగిందని మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్ ఏడిద బాబీ అన్నారు.
చిరంజీవి పెద్ద కూతురు, ప్రముఖ నిర్మాత సుస్మిత కొణిదెల ఆధ్వర్యంలో ఏర్పటైన మెగా యూత్ ఫోర్స్ సమావేశం ఆదివారం అరండాల్ పేటలోని ప్రముఖ హోటల్ లో జరిగింది. ఈ సమావేశానికి గుంటూరు జిల్లా మెగా యూత్ ఫోర్స్ నాయకుడు చింత శివ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఏడిద బాబీ మాట్లాడుతూ.. రక్తదానం, నేత్రధానం వంటి మహోన్నతమైన కార్యక్రమాల ద్వారా చిరంజీవి అభిమానులు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం పొందారన్నారు.
ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆపన్నులకు, అన్నార్థులకు మరింత అండగా నిలవాలని అభిమానులను బాబీ కోరారు. విశిష్ట అతిధిగా పాల్గొన్న జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ మెగాఫ్యామిలీ చేస్తున్న సేవా కార్యక్రమాలు, పేద విద్యార్థుల కోసం, సామాన్యుల ఆరోగ్యం దృష్ట్యా తీసుకుంటున్న సేవలను ప్రజలకు మరింత చేరువ అయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రతీ అభిమానిపై ఉందన్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను విస్తృత స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.
ఈ క్రమంలోనే తమ స్వార్థం కోసం, ఉనికి కోసం కొంతమంది మెగాఫ్యామిలీపై చేస్తున్న అసందర్భ విమర్శలపై అభిమానుల నుంచి తగిన స్థాయిలో ప్రతిస్పందన ఉండాలన్నారు. సమాజానికి మేలు తప్పా కలలో కూడా కీడు చేయని మెగా ఫ్యామిలీ పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మెగా యూత్ ఫోర్స్ సహించదని, అభిమానుల నుంచి అదే స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని ఆళ్ళ హరి హెచ్చరించ్చారు.
ఈ సందర్బంగా సీనియర్ చిరంజీవి అభిమానులు గిడుతూరి సత్యం, సుధాకర్ రెడ్డి, నాంచారయ్య, తేజ, సురేష్, చలమయ్య, సాంబశివరావు, చంద్ర, భాస్కర్ రెడ్డి, రామారావు, శంతన్ కుమార్, పసుపులేటి రాంబాబు, రామిశెట్టి ధరణి తదితరులను మెగా యూత్ ఫోర్స్ సభ్యులు ఘనంగా సన్మానించ్చారు.