నరసాపురంలో మూగజీవుల కోసం నీటి తొట్ల పంపిణీ కార్యక్రమం

నరసాపురం పట్టణంలోని బస్టాండ్ వద్ద శ్రీమతి బల్లారత్న ఆధ్వర్యంలో మూగజీవుల కోసం నీటి తొట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేసవి కాలంలో మూగజీవుల దాహార్తిని తీర్చే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ.. మూగజీవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.