
నెల్లూరు: సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇటీవల అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఈ పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా క్షేత్రంలో చురుకుగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.
సూళ్లూరుపేట జనసేన నాయకులు ఎస్.కె. మా బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్, షేక్ మాభాష, కయ్యాల కోటియాదవ్, వీర మహిళ సుజాత, సూర్య, గణపతి, సాయి, ప్రవీణ్, ప్రశాంత్ గౌడ్, వేముల శివకృష్ణ, చిత్తూరు బాలాజీ, హర్ష తదితరులు పాల్గొన్నారు.