
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదాల బారినపడి మృతి చెందిన 13 మంది బాధితుల కుటుంబాలకు శ్రీ కొరికాన రవికుమార్ గారు “కొరికాన ఫౌండేషన్” తరఫున ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సహాయాన్ని K. Nagababu గారి చేతుల మీదుగా ఎచ్చెర్లలోని కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అందించారు. ప్రమాద బీమా అందుకోలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, ఇంచార్జీలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రజల కష్టకాలంలో అండగా నిలవడం జనసేన పార్టీ లక్ష్యం అని నాయకులు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగుతాయని వెల్లడించారు.