

అరణ్యమే వేదిక… గిరిజనమే అతిథులు… అనే ప్రత్యేక భావంతో పాడేరు నియోజకవర్గంలోని ఓనూరు గ్రామంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
Pawan Kalyan గారు స్వయంగా మారుమూల గిరిజన ప్రాంతానికి చేరుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిరిజనులతో కలసి వారి సమస్యలను తెలుసుకుంటూ, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని కార్యకర్తలు తెలిపారు.
జనసేన పుష్కరోత్సవం (2014 – 2026) సందర్భంగా ఆయన ప్రయాణాన్ని స్మరించుకుంటూ కార్యకర్తలు భావోద్వేగానికి లోనయ్యారు.
“నాడు ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు… కానీ గుండెల నిండా ధైర్యం ఉంది” అనే సందేశాన్ని గుర్తుచేస్తూ, నేడు గ్రామీణాభివృద్ధిలో సాధించిన ప్రగతిని వివరించారు.
మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ, ప్రజా పాలనలో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
జనసేన పార్టీ ఆశయాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ కార్యక్రమం కీలక ఘట్టంగా నిలిచింది.