



జనసేన పార్టీ చేపట్టిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను కూడా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan గారి విజన్‌ను బలపరిచేందుకు విదేశాల్లో ఉన్న భారతీయులు (NRIs) కూడా ఉద్యమి సభ్యత్వంలో భాగస్వాములు కావాలని పార్టీ ఆహ్వానం పలుకుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనసేన అభిమానం కలిగిన వారు పార్టీ సిద్ధాంతాలకు మద్దతుగా ముందుకు రావాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. జనసేన ఉద్యమి సభ్యత్వం ద్వారా పార్టీ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించే అవకాశం ఉంటుంది.
ఈ కార్యక్రమం ద్వారా జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోంది.
జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం పట్ల ఇప్పటికే దేశ విదేశాల్లో మంచి స్పందన లభిస్తోందని పార్టీ నాయకులు తెలిపారు.