

టీ20 క్రికెట్ ప్రపంచకప్ తుది పోరులో ఘన విజయం సాధించి విజేతగా నిలిచిన భారత జట్టుకి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మ్యాచ్ లో తొలి నుంచి ఆధిపత్యం చాటిన మన జట్టు సాధించిన ఈ విజయం క్రీడాభిమానులకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సభ్యులు తమ క్రీడా ప్రతిభను చాటారు. సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలకు ప్రత్యేక అభినందనలు. ఈ పోటీలో పోరాడిన శాంటర్న్ నాయకత్వంలోని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సభ్యుల ప్రతిభ విస్మరించలేనిది. వారికి అభినందనలు. ఆ జట్టులోని జేమ్స్ నీషమ్ బౌలింగ్, సీఫెర్ట్ బ్యాటింగ్ ను క్రికెట్ అభిమానులు మరచిపోలేరు అని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.