గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబుకు ధన్యవాదాలు

రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి… పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంపూర్ణ సహకారం అందించి నిధులు కేటాయిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా – గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలనే సంకల్పానికి బలమిస్తూ తగిన నిధులు సమకూరుస్తున్నారు. ఈ రోజు సాగిన సుదీర్ఘ సమావేశంలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం మరింత వేగవంతానికి విలువైన సూచనలు అందించారు. గౌరవ ముఖ్యమంత్రివర్యుల సూచనలు అనుసరిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగమవుతామని శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.