
విశాఖపట్నంలో జరిగిన జనసేన పార్టీ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పీఏసీ ఛైర్మన్ మరియు రాష్ట్ర మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చేసిన ప్రధాన వ్యాఖ్యలు:
???? పార్టీ విలువలు & కార్యకర్తల ప్రాధాన్యం
- నిజాయితీ గల జనసైనికులు, వీర మహిళలే పార్టీకి ఇంధనం.
- పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది.
- పదవులు ఒక్క రోజులో రావు, కానీ ప్రతి ఒక్కరి కష్టానికి సరైన గుర్తింపు వస్తుంది.
- బలహీన వర్గాలు, మహిళలు, చేనేతలు, మత్స్యకారులు – ప్రతి వర్గం సమస్యలపై జనసేనే ముందుంటుంది.
???? సోషల్ మీడియా దుష్ప్రచారంపై కఠినంగా
- సోషల్ మీడియాలో జరుగుతున్న కుట్రలు, ముఖ్యంగా మహిళలపై దాడులను పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది.
- దీనిని అరికట్టేందుకు చట్ట సభల్లో బలమైన స్వరం వినిపిస్తుంది.
- పార్టీ నాయకులు ప్రతిరోజూ సమకాలీన అంశాలపై మాట్లాడాలి.
???? స్టీల్ ప్లాంట్ – ఆంధ్రుల హక్కు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొట్టమొదటగా పోరాడింది జనసేన పార్టీనే.
- పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలసి ఆంధ్రుల గౌరవం కాపాడారు.
- ఇప్పటికీ జనసేన కూటమి ప్రభుత్వం బలంగా పోరాడుతోంది.
???? సుగాలి ప్రీతి కేసు – న్యాయం కోసం పోరాటం
- గిరిజన బాలిక సుగాలి ప్రీతి అన్యాయంపై నిజాయితీగా పోరాడింది జనసేన మాత్రమే.
- పవన్ కళ్యాణ్ కర్నూలులో 2 లక్షల మందితో కవాతు నిర్వహించారు.
- బాధిత కుటుంబానికి సాయం, భూములు, ఉద్యోగం – ఇవన్నీ ఆయన ఒత్తిడితో సాధ్యమయ్యాయి.
- కేసులో న్యాయం జరగాల్సిందే అన్నది జనసేన పార్టీ విధానం.
???? కూటమి స్ఫూర్తి
- జనసైనికులు, వీర మహిళలు కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.
- రాష్ట్ర అభివృద్ధి కోసం అలయెన్స్ బలపడి ముందుకు సాగాలి.
???? రెండు తీర్మానాలు ఆమోదం
- పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులకు ధన్యవాదాలు.
- పార్టీ సంస్థాగత నిర్మాణం, సంస్కరణలపై అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలకు ఆమోదం.
