
రాజానగరం, రాజమండ్రి:
రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, డిఎఫ్ఓ జిల్లా అటవీ అధికారి వి. ప్రభాకర రావు మరియు దివాన్ చెరువు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మావతి తో కలిసి రాజమండ్రి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ముఖ్యంగా, రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలోని ఫారెస్ట్ అకాడమీ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. వేసవి కాలంలో వివిధ జాతుల అరుదైన పక్షులు కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి పుణ్యక్షేత్రం గ్రామానికి చేరుకుంటాయని, వీటిని చూడటానికి పర్యాటకులు వచ్చినందున ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
అదే సమయంలో, పక్షుల సంరక్షణ కేంద్రము ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.