
పాలకొండ నియోజకవర్గం: పాలకొండ మండలంలోని యార్కరాయిపురం గ్రామంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడు, పాలకొండ నియోజకవర్గ సీనియర్ నాయకుడు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో బుధవారం జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. జనసేన పార్టీ బలోపేతం కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కీలకమని నాయకులు పేర్కొన్నారు.
గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, యువత మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు తీసుకుని పార్టీ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.