
పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ పాడేరు ఇన్చార్జి, రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమీ చైర్మన్ డా. గంగులయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు జరిగాయని, తిరుమల తిరుపతి లడ్డూ నెయ్యి విషయంలో కల్తీ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని విమర్శించారు. ఎస్టీ, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల దుర్వినియోగంతో ఆ వర్గాల అభివృద్ధి దెబ్బతిన్నదని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేపట్టిన “పల్లె పండగ”, “అడవి తల్లి బాట” వంటి అభివృద్ధి కార్యక్రమాలను గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు. గ్రామస్థాయిలో జనసైనికులు, నాయకులు, వీర మహిళలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
త్వరలో ప్రారంభంకానున్న క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి భారీ స్థాయిలో చేపట్టాలని, జనసైనికులు విస్తృత ప్రచారం చేయాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు సిద్ధం కావాలని, క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ ప్రజాభిమానాన్ని పొందాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, తల్లే త్రిమూర్తులు (పి ఏ సీ ఎస్ చైర్మన్), పాంగి శివాజీ, వంపూరు సురేష్ (కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్), కిమ్ముడు కృష్ణమూర్తి, బొంకులు దివ్యలత, అధికార ప్రతినిధి సెగ్గే భావన సాయి జయంతి, జి. పార్వతమ్మ, నాందోలి మురళీకృష్ణ (మండల అధ్యక్షుడు), మసాడి భీమన్న, జి. మాడుగుల లక్ష్మణ్, గొర్లె వీరవెంకట్ (జీకే వీధి మండలం ఎగ్జిక్యూటివ్ మెంబర్), బత్తుల సిదార్డ్ మార్క్ (ఉపాధ్యక్షుడు) తదితరులు పాల్గొన్నారు.