పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో విద్యార్థుల వసతికి పరుపులు–దుప్పట్లు పంపిణీ

పిఠాపురం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు మరింత విస్తరిస్తున్నాయి. మూలపేట గ్రామంలోని బాలుర వసతి గృహాలకు పరుపులు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు నిర్వహించారు.

శనివారం యు కొత్తపల్లి మండలంలోని బీసీ, ఎస్సీ బాలుర వసతి గృహాలను పరిశీలించిన ఆయన, అక్కడి విద్యార్థులు కటిక నేలపై పడుకుంటున్న పరిస్థితిని గమనించి సహాయం అందించారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకుడు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో సుమారు 20 మంది విద్యార్థులకు పరుపులు, దుప్పట్లు అందజేశారు.

ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. నియోజకవర్గంలో స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అభివృద్ధికి తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామీశెట్టి రాంబాబు, పల్లెటి బాపన్న దొర, గంట విజయ్ కుమార్, ఉమ్మిడి ఆమలేశ్వరి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.