
తంబళ్లపల్లి: శనివారం నడి ఒడ్డున జనసేన పార్టీ తంబళ్లపల్లి ఇన్చార్జ్ పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర పిఎసి మెంబర్, ఏపీ హస్తకళల చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, మదనపల్లి బీసీ నాయకులు బండి మనోహర్, మదనపల్లి జనసేన నాయకులు తంబాలపల్లి జనసేన నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేశారు.