ఏపీ కేబినెట్ సమావేశం.. 33 అజెండాలకు ఆమోదం

AP cabinet meeting

అమరావతి, ఏపీ సచివాలయం:
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది.

  • సీఆర్డీఏ 51వ సమావేశం ప్రతిపాదనలు మంత్రివర్గ ఆమోదం పొందాయి.
  • రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపబడింది.
  • ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025–30కి ఆమోదం లభించింది.
  • పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలు మంజూరయ్యాయి.
  • సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఉపసంఘం సిఫార్సులు మంత్రివర్గ ఆమోదం పొందాయి.

ఉద్యోగాలు & పరిపాలన:

  • గ్రామ, వార్డు సచివాలయాల్లో 2,778 పోస్టులను డిప్యూటేషన్, ఔట్సోర్సింగ్ ఆధారంగా భర్తీ చేయనున్నారు.
  • అధికారిక భాష కమిషన్ పేరును ‘మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాష కమిషన్’గా మార్చారు.

అభివృద్ధి & ప్రాజెక్టులు:

  • తోట వెంకటాచలం (కాకినాడ) లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం.
  • పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లకు సవరణలు మంజూరయ్యాయి.
  • కడప మైలవరంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.
  • అదానీ సోలార్ ఎనర్జీకి 200.05 ఎకరాలు కేటాయింపు.

ఇతర ముఖ్య నిర్ణయాలు:

  • గుంటూరులో తెదేపా కార్యాలయ భూమి లీజు కాలపరిమితి పొడిగింపు.
  • చిత్తూరు సీహెచ్సీని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి, 56 కొత్త పోస్టుల మంజూరు.
  • నాలా పన్ను 4 శాతం లోపల 70% స్థానిక సంస్థలకు, 30% అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయం.
  • ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదాకి ఆమోదం.
  • మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్ల టెండర్ కమిటీ సిఫార్సులు మంజూరయ్యాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.