నూజివీడు నియోజకవర్గం : ముసునూరు మండలంలో రమణక్కపేట గ్రామంలో ఉన్న అధ్వానంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మీద జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు స్థానిక నాయలుకులతో కలిసి నిరసన తెలిపి అనంతరం ఆయన మాట్లాడుతూ మండలాలలో దాదాపు అన్ని ఏరియాలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ప్రభుత్వం పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ నిధులను వాడుకుంటూ గ్రామ అభివృద్ది , సమస్యలను గాలికి వదిలేసిందని సర్పంచులు కూడా చేసేది ఏమి లేక చేతులెత్తేలతేతెశారు. పంచాయితీరాజ్ శాఖ అధికారులు కూడా నిధులు లేవని మేము చేసేది ఏమి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం పంచాయితీలకు నిధులు మంజూరు చేసి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్య క్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబుతో పాటు మండల గ్రామ నాయకులు వేట త్రినాథ్, ఉప్పే శ్రీనివాస రావు, నరేంద్ర, నిలికొండ రాజా, చేకురి అనిల్, గుండాల శివ, కమతంశెట్టి రాజా, కెత్తే కిరణ్ తదితరులు పాల్గొన్నారు.