లండన్ మేయర్ ఎన్నికలలో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, పారిశ్రామికవేత్త శ్రీ తరుణ్ గులాటీ బుధవారం హైదరాబాద్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు . స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శ్రీ గులాటీ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాల్సిందిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరారు . తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసైనికులు గణనీయంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు . శ్రీ గులాటీ అభ్యర్థనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు . భారత సంతతికి చెందిన శ్రీ గులాటి లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడం సంతోషదాయకమని, తన అభిమానులు, జనసేన శ్రేణులతోపాటు తెలుగువారు , భారతీయులంతా ఆయన విజయానికి కృషి చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరారు . తనను కలసిన శ్రీ గులాటీకి శుభాభినందనలు తెలియచేశారు.