- రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది
- సినిమాలు విడుదలైనప్పుడే మనం మెగా ఫ్యాన్స్… మిగిలిన సమయంలో జన సైనికులం, వీర మహిళలం
- వచ్చేది జనసేన- తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమే
- మన ప్రభుత్వం లో సంక్షేమ పథకాలకు తాతలు, తండ్రుల పేర్లు కాకుం డా మహనీయుల పేర్లు పెడదాం
- అనకాపల్లిలో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక- ఏ రాష్ట్రంలో కూడా వైసీపీ లాంటి
చెత్త ప్రభుత్వాన్ని చూడలేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు
అన్నారు. ప్రజా ధనంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తాతలు, తండ్రులు,
తన పేర్లు పెట్టుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు . వచ్చేది జనసేన-
టీడీపీ ప్రభుత్వమేనని, ప్రజా ప్రభుత్వం లో ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసిన
మహానీయుల పేర్లను సంక్షేమ పథకాలకు పెడతామని హామీ ఇచ్చారు. అవినీతితో
కుళ్లిపోయిన వైసీపీ సర్కార్ ను గద్దె దిం చి… రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత
మనందరిపై ఉందని, మరో రెండు నెలలు అందరం కలిసికట్టుగా పనిచేస్తే వైసీపీ
దుష్టపాలన నుం చి విముక్తి పొందవచ్చని అన్నారు. ఉత్తరాం ధ్ర వెనకబాటుతనానికి
రాజకీయ నాయకులే కారణమని, ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా
తీసుకొని వేలకోట్లు దోచుకున్నారని అన్నారు. ఆదివారం విశాఖ ఉమ్మడి జిల్లా
మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం అనకాపల్లిలో జరిగిం ది. ఈ సందర్భంగా
శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ… “ఉత్తరాం ధ్ర ప్రాంతంలో అనేక సమస్యలు
ఉన్నాయి. ఒకవైపు జీవనదులు ప్రవహిస్తోన్నా రైతులకు సాగు నీరు అందడం లేదు. చక్కెర పరిశ్రమలు మూతపడి రైతులు, కార్మికులు రోడ్డున పడ్డారు. చాలా గ్రామాల్లో తాగు నీరు
అందడం లేదు. కాలుష్యం ప్రాణాలు కబళిస్తోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్లిపోతున్నారు. ఇక్కడి రాజకీయ నాయకులకు భూములు కబ్జా చేయడంలో
ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కరిం చడంలో లేదు. మన ప్రాంతాన్ని మనమే బాగు చేసుకోవాలి. మన ప్రజల బాగోగులు మనమే చూసుకోవాలి. ఉత్తరాం ధ్ర వెనుకబాటు తనాన్ని
తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగిం చి ముం దుకు రావాలి.
• ఎంత ఆక్రమిం చుకున్నా… చివరకు కావాల్సిం ది ఆరు అడుగులే
వైసీపీలో చాలా మంది నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే, ఐ.టి.శాఖ మంత్రి కూడా వందల కోట్లు విలువ చేసే విసన్నపేట భూములను కబ్జా చేశారనే
ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమి నాది అని విర్రవీగే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిం ది ఏమిటంటే… భూమికి మనం చెం దుతాము కానీ… మనకి ఎప్పుడు భూమి చెం దదు. మనం
పోయిన తరువాత ఇదే భూమి ఇంకొకడి సొంతం అవుతుం ది. వందల ఎకరాలు ఆక్రమిం చుకున్నా… మనం చనిపోయాకా మనకు కావాల్సిం ది మాత్రం 6 అడుగుల భూమే. పేద ప్రజల
కడుపులు కొట్టి కొల్లగొట్టిన వేల కోట్లతో ప్రశాం తంగా జీవిం చలేరు. జనసేన- టీడీపీ ప్రభుత్వం వచ్చాక భూములు దోచుకున్న రాం బందులను న్యాయస్థానాల్లో నిలబెట్టి శిక్ష పడేలా
చేస్తాం.
• భవిష్యత్తు ఉన్న పార్టీ జనసేన
రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగల సత్తా జనసేన పార్టీకే ఉంది. 25 ఏళ్ల రాజకీయాలను ఊహిం చుకుంటే కనిపించే ఒకే
ఒక్క నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయతీపరుడైన నాయకుడికి మనం అండగా నిలబడాలి. ఆయనకు
పదవులు, డబ్బుపై ఆశ లేదు.. ప్రజల జీవన ప్రమాణాలు మార్చాలన్న ఆకాం క్ష తప్ప. కష్టపడి సంపాదిం చిన సొమ్ము ను సైతం ప్రజల కోసం ఖర్చు చేస్తున్న ఏకైక నాయకుడు శ్రీ
పవన్ కళ్యాణ్ గారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తరువాత కూడా పట్టువదలకుం డా ప్రజల సమస్యలపై యుద్ధం చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు,
రాజధాని రైతుల సమస్యలపై పోరాడారు. రాజకీయ నాయకుడు అనే వాడు
ఎలక్షన్ కోసం పోరాడతాడు. శ్రీ పవన్ కళ్యాణ్ వంటి గొప్ప నాయకుడు
ముం దు తరాల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తారు. తెలుగుదేశం పార్టీతో
జనసేన పొత్తు పెట్టుకోవడానికి బలమైన కారణం ఉంది. ప్రతీ యుగంలో
దేవుళ్లు కన్నా రాక్షసులకు కాస్త శక్తి ఎక్కువగా ఉంటుం ది. రాక్షసులను
వంధిం చి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతీ యుగంలో కొం తమంది వ్యక్తులు
పుడతారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వా పరయుగంలో శ్రీ కృష్ణుడు
పుట్టినట్లు… కలియుగంలో వైసీపీ దుష్టపాలనను అంతమొందిం చడానికి శ్రీ
పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయనకు అండగా నిలబడి దుష్ట వైసీపీని
ఇంటికి పంపించే వరకు మనందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. పార్టీ
కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు వస్తుంది. రాజకీయంగా ఉన్నత
స్థానాలకు ఎదుగుతారు. మన హీరో సినిమా వచ్చినప్పుడు మాత్రమే మనం
మెగా ఫ్యాన్స్… రాజకీయాలకు వచ్చే సరికి మనమంతా జనసైనికులం,
వీరమహిళలమని గుర్తుంచుకోవాలని” అన్నారు.
• నూకాలమ్మ, గౌరీపరమేశ్వర్లను దర్శిం చుకున్న శ్రీ నాగబాబు
ఉత్తరాం ధ్ర ప్రజల ఆరాధ్య దైవం అనకాపల్లి శ్రీ నూకాలమ్మ, శ్రీ గౌరీ
పరమేశ్వర్ల ఆలయాలను శ్రీ నాగబాబు గారు దర్శిం చుకున్నారు. ఆలయ
సిబ్బం ది శ్రీ నాగబాబు గారికి ఘన స్వాగతం పలికారు. రెండు ఆలయాలలో
ప్రత్యేక పూజలు నిర్వహించారు . పూజలు అనంతరం వేద పండితులు
అమ్మవారి చిత్రపటాన్ని బహుకరిం చి, తీర్ధప్రసాదా లను శ్రీ నాగబాబు గారికి
అందించారు .