మదనపల్లె నియోజకవర్గం : మదనపల్లి మండలం, నక్కలదిన్నె తాండ, పప్పి రెడ్డిగారి పల్లెలో ఆదివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం , పట్టణ ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన పట్టణ బాట, పల్లె బాట కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రాందాస్‌కు నక్కలదిన్నె యువత జనసేన నాయకులు కార్యకర్తలు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అని అంటూ ఉంటారు. కానీ నిజమైన ప్యాకేజీ స్టార్ తెలంగాణలో మీ చెల్లి చేత పార్టీ పెట్టించి కాంగ్రెస్‌కి ఓట్లు వేయమని చెప్పే మీ చెల్లి షర్మిలని అడ్డు పెట్టుకొని నువ్వు ఎంత ప్యాకేజీ తీసుకొంటున్న నువ్వు పెద్ద ప్యాకేజీ స్టార్ అని అన్నారు. ఈ సందర్భంగా అర్ధనా జగన్ అని ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి కి నామకరణం చేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగల శివరాం , రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీ సనాఉల్లా, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, రామసముద్రం మండలం అధ్య క్షులు చంద్రశే ఖర్, ఐటీ విభాగ నాయకులు కల్లూరు లక్ష్మినారా యణ, చందు, జియో మదనపల్లి డీలర్ చంద్రమోహన్, రెడ్డెమ్మ, జై శేఖర్, జవిలి మోహన్ కృష్ణ, చంద్రశేఖర్ అర్జున, లవన్న నరేష్, జనర్దన్, శంకర, విజయ్ కుమార్, గంగులప్ప , నారాయణ స్వామి , ఆది నారాయణ, సల్మాన్ ఖాన్, బాషా , అరవింద్ రాయల్, మురే రమేష్, సుశాంత్ రాయల్, ఉమేష్ బోనాల, బండరాల్ల చైతూ, శివ రాయల్, వెంకటేష్, వేంకీ జంగాల, సంతోష్ జంగాల, బండి చరణ్, నరేష్, గణేష్, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.