
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర విజయాన్ని ఆకాంక్షించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె.అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. చిత్ర బృందం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని ప్రేక్షకులను అలరించే విధంగా తీర్చిదిద్దింది. శ్రీ అచ్చెన్నాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు అని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.