కాకినాడ రూరల్ నియోజకవర్గం లో పెనుమర్తి గ్రామంలో జనసేన మరియు తెలుగుదేశం సంయుక్తంగా ఇంటింటికి పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చి మరి నేటికి రైతుకు అండగా ఉండకుండా, యువతకి అండగా ఉండకుండా, శ్రామికులకు అండగా ఉండకుండా ఎలక్షన్ల తాయులాలుగా యువతకి ఇప్పుడు గ్రూప్ 1 పరీక్షలు అనడం చాలా హాస్యాస్ప దంగా ఉందని, వారి పార్టీ పేరులో ఉన్నవారందరికీ కూడా అన్యాయం చేసుకుంటు వస్తూ ఉంది ఇంక ఒక్క ఛాన్స్ ఇద్దాం అని ఓట్లు వేసిన మిగతా ప్రజలకు మొండి చెయ్యి చూపించింది. ఇటువంటి వైసిపి ప్రభుత్వం అంతం అయ్యే రోజు త్వరలోనే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. మరి రాబోయే జనసేన, తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వా నికి మద్దతు కోరుతూ చేపట్టిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుభుయాలు శ్రీమతి & శ్రీ పిల్లి అనంత లక్ష్మి సత్య నారాయణ మూర్తి ఇరు పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.