
గురజాల: గురుకుల విద్యాలయంలో విద్యార్థులు ఆకలితో బాధపడుతున్నట్లు , మెనూ ప్రకారం పెట్టాల్సినవి పెట్టకుండా .. చాలీచాలని నీళ్ళ సాంబార్ పోసిన వీడియో వైరల్ అవ్వడంతో.. గురువారం గురజాల నియోజవర్గం , పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ నాయకులు విద్యార్థులను సందర్శించి, భోజనం వారికి ఏ విధంగా అందిస్తున్నారో.. మెనూ ప్రకారం ఎలా పెడుతున్నారో తెలుసుకోవడం జరిగింది. విద్యార్థులు మాట్లాడుతూ.. సమయానికి భోజనం అందించడం లేదని, ఒక్కొక్కసారి క్లాసులు సైతం మిస్అవుతున్నాయని, చాలీచాలని భోజనం పెడుతున్నారని, అదేమిటని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని, విద్యార్థుల భోజనానికి వాడే సరుకుల్ని పక్కదారి పట్టిస్తున్నారని, ప్రిన్సిపాల్కి సైతం తెలియజేసినా ఫలితం లేదని వాపోయారు. ఈ కార్య క్రమంలో జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాశీం సైదా, మండల ఉపాధ్యక్షులు బయ్య వరపు రమేష్, ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు, కార్యదర్శి దీకొండ కిరణ్, కంభంపాటి ముక్కంటి, జనసేన నాయకులు పెడకోలిమి కిరణ్ కుమార్, జెస్సి తదితరులు పాల్గొన్నారు.