పార్వతీ పురం: ఓటరు జాబితాలో నా ఓటు పదిలం.. మీ ఓటు పదిలమేనా..? అని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు అన్నారు. ఆదివారం జరిగిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా పార్వతీ పురం మున్సిపాలిటీలోని సంస్కృత పాఠశాలలో ఏర్పాటుచేసిన 20, 21 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఓటరు జాబితాను ఆయన పరిశీలించారు. ఆ జాబితాలోని చేర్పులు, తొలగింపులు, బదిలీలు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బిఎల్వో లు వి. కిరణ్, బి. సంతోషులతో మాట్లాడి ఓటరు జాబితాలోని చేర్పులు, మరణాలు, తొలగిం పులు, బదిలీలు తదితర వాటి పై చర్చిం చారు. ఎటువంటి తప్పి దాలు లేకుండా స్పష్టమైన, పరి పూర్ణమైన ఓటరు జాబితా రూపొం దాలన్నా రు. ఈ సందర్భం గా తన ఓటును జాబితాలో తని ఖీ చేశారు. జాబితాలో తన ఓటు పదిలంగా ఉందన్నా రు. ముఖ్యం గా ఎన్నికల కమిషన్ ప్రజల్లో చైతన్యం తీసు కొచ్చేంచేచుందుకు పలు కార్య క్రమాలు చేపడుతోం దన్నా రు. వాటి కి అనుగుణంగా ప్రతి ఓటరు బాధ్య తగా తమ ఓటు జాబితాలో ఉందో లేదో సరి చూసు కోవాలన్నా రు. ఒకవేళ లేకపోతే మళ్లీ చేర్ చుకోవాలన్నా రు. 18 సంవత్స రాలు నిం డిన ప్రతి యువతి, యువకులు ఓటర్లు గా నమోదుకు ప్రతి ఒక్కరూ సహకరిం చాలన్నా రు. ఓటు అనేది రాజ్యాం గం ప్రసాదిం చిన వరం అన్నా రు. అటువంటి దాన్ని పొందేం దుకు ప్రతి ఒక్కరు బాధ్య తగా వ్య వహరిం చి అధి కారులకు సహకరిం చాలన్నా రు. అలాగే ప్రతి ఒక్క ఓటరు చైతన్యం పొం ది ఎన్నికల్లో ఓటును విని యోగిం చుకోవాలన్నా రు. ఓటిం గ్ శాతం పెరి గేలా చైతన్యం నిం పుకోవాలన్నా రు. అలాగే ప్రలో భాలకు లొం గని ఓటర్ల సమాజ నిర్ మాణాని కి ప్రతి ఒక్కరూ కంకణం కట్టు కోవాలి అన్నా రు. ఓటరు జాబితాలో తన ఓటు పదిలంగా ఉందన్నా రు. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఓటు జాబితాలో ఉందో లేదో సరి చూసు కోవాలని పిలుపునిచ్చా రు. ముఖ్యం గా యువత ఓటు నమోదులో ముం దుకు రావాలన్నారు.