నరసాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకన చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నరసాపురం మండలంలో గల జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుల సమావేశం నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, PAC సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకర్ గారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించే విధంగా అందరూ కృషి చెయ్యాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.