ముమ్మిడివరం నియోజకవర్గం: ఐ పోలవరం మండలం,
టి కొత్తపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు కాళ్ళ
వీరబాబు, ఐ పోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన జనసేన
పార్టీ క్రియాశీల కార్యకర్త దేవు వీరబాబు ఇటీవల ప్రమాదంలో గాయపడి
హాస్పిటల్లో చికిత్స పొందారు. వీరబాబు జనసేన పార్టీ క్రియాశీలక
సభ్యులైనందున వారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరఫున
రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 50,000 రూపాయల జనసేన
పార్టీ భీమా చెక్కులు విడుదల చేశారు. ఈ చెక్కులను వారి ఇంటిదగ్గర
జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్
పితాని బాలకృష్ణ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐ పోలవరం మండల
అధ్యక్షులు మద్దింశెట్టిపురుషోత్తం, రాయపురెడ్డి బాబీ, నరాలశెట్టిరాంబాబు,
లంకెలపల్లి జమి, దేవు రాంబాబు, మల్లిపూడి రాజా, సలాది రాజా, పితాని
రామకృష్ణ, సవరపు వెంకట్, అప్పాడి బాబ్జి, వాసంశెట్టి బాబ్జి, కొర్లపాటి
సాయిరాం కిరణ్, పితాని రాజు, రాయపురెడ్డి యేల్లేశ్వరరావు, చోడిశెట్టి
వీరబాబు, నేదునూరి బాబీ మొదలగు వారు పాల్గొన్నారు.