ఆర్డీఓ అంబరీషుకు జనసేన నాయకుల అభినందనలు

నరసాపురం నూతన ఆర్డీవోగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎం అచ్యుత్ అంబరీష్ ని జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయనకు నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పి ఏ సి సభ్యులు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్, రాష్ట్ర జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు బొమ్మిడి నాయకర్ శాలువా కప్పి పుష్ప గుచ్చమిచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అంబరీషన్ను అభినందిస్తున్న జనసేన నాయకులు పార్టీ పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వీర వెంకటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.